గోల్డెన్ ఛాన్స్

05-10-2026 | 01:28pm

18 ఏళ్లకే సంచలనం.. ఇప్పుడు కెప్టెన్‌గా పృథ్వీ షా!

ఒకప్పుడు భారత క్రికెట్‌లో ఫ్యూచర్ స్టార్గా కనిపించిన పృథ్వీ షా(Prithvi Shaw Comeback).. ఇప్పుడు మరో కీలక మలుపు వద్ద నిలిచాడు. చిన్న వయసులోనే అద్భుతమైన బ్యాటింగ్‌తో అందరి దృష్టిని ఆకర్షించిన ఈ విధ్వంసకర ఓపెనర్.. 2018లో భారత అండర్-19 జట్టుకు ప్రపంచకప్ అందించాడు. ఆ తర్వాత కేవలం 18 ఏళ్ల వయసులోనే టీమిండియాలోకి అడుగుపెట్టి తొలి టెస్టులోనే సెంచరీతో సంచలనం సృష్టించాడు. అయితే ఆ స్థాయి నుంచి పృథ్వీ షా కెరీర్ అనుకున్నంత వేగంగా ముందుకు సాగలేదు. జాతీయ జట్టులో చోటు కోల్పోయిన అతడు ఇప్పుడు దేశవాళీ క్రికెట్‌లో తన సత్తా చాటేందుకు ప్రయత్నిస్తున్నాడు. ఈ క్రమంలో Prithvi Shaw Captaincy అతడి కెరీర్‌కు మరో కీలక అవకాశంగా మారింది.

రంజీలో షాకు కెప్టెన్సీ

Ranji Trophy 2026-27 సీజన్‌లో మహారాష్ట్ర తొలి మ్యాచ్‌కు పృథ్వీ షా కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. అక్టోబర్ 11 నుంచి 14 వరకు ఢిల్లీలోని పాలం ఎ స్టేడియంలో జరిగే ఎలైట్ గ్రూప్-సి మ్యాచ్‌లో మహారాష్ట్ర, సర్వీసెస్‌తో తలపడనుంది. మహారాష్ట్ర రెగ్యులర్ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ ఈ మ్యాచ్‌కు అందుబాటులో ఉండటం లేదు. ఆస్ట్రేలియా-ఎతో జరిగే మూడు అనధికారిక వన్డేల కోసం రుతురాజ్‌ను ఇండియా-ఎ కెప్టెన్‌గా ఎంపిక చేశారు. అక్టోబర్ 6, 9, 11 తేదీల్లో పుదుచ్చేరిలో ఈ మ్యాచ్‌లు జరగనున్నాయి. దీంతో గైక్వాడ్ గైర్హాజరీలో Maharashtra Captain Prithvi Shawగా జట్టును నడిపించనున్నాడు.

ఇదే కంబ్యాక్‌కు టర్నింగ్ పాయింటా?

2025-26 సీజన్‌కు ముందు ముంబైని వీడి మహారాష్ట్రలో చేరిన పృథ్వీ షా( Prithvi Shaw Ranji Stats).. తన తొలి సీజన్‌లోనే చెప్పుకోదగ్గ ప్రదర్శన ఇచ్చాడు. ఏడు మ్యాచ్‌ల్లో 11 ఇన్నింగ్స్‌లు ఆడి 537 పరుగులు సాధించి మహారాష్ట్ర తరఫున అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా నిలిచాడు. ఇప్పుడు అతడి ముందున్న సవాల్ మరింత పెద్దది. Prithvi Shaw Ranji Trophy Comebackను బలపరుచుకోవడంతో పాటు, కెప్టెన్‌గా జట్టును నడిపించాల్సిన బాధ్యత కూడా అతడిపై ఉంది.

టీమిండియా తలుపులు మళ్లీ తెరుచుకుంటాయా?

పృథ్వీ షా గతంలో భారత్(Prithvi Shaw India Comeback) తరఫున మూడు ఫార్మాట్లలోనూ ఆడాడు. ప్రస్తుతం జాతీయ జట్టుకు దూరంగా ఉన్న అతడికి దేశవాళీ క్రికెట్‌లో పరుగులు చేయడం అత్యంత కీలకం. ఇప్పుడు Prithvi Shaw Comebackపై అభిమానుల దృష్టి పడటానికి కెప్టెన్సీ కూడా మరో కారణంగా మారింది. మహారాష్ట్రకు కెప్టెన్‌గా తొలి మ్యాచ్‌లోనే పృథ్వీ షా ఎలా రాణిస్తాడు? బ్యాట్‌తో భారీ స్కోర్ చేసి తన కంబ్యాక్‌కు బలమైన సంకేతం ఇస్తాడా? లేక కెప్టెన్సీ ఒత్తిడిని కూడా సమర్థంగా ఎదుర్కొంటాడా? అనేది ఆసక్తికరంగా మారింది. 

మరిన్ని వార్తలు