విద్యార్థుల భవిష్యత్ కు అండగా రేవంతన్న ప్రభుత్వం..

05-10-2026 | 08:14pm

70 కోట్లతో నియోజకవర్గంలోని ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి..

రాష్ట్ర ప్రభుత్వ విప్, పెద్దపల్లి శాసనసభ్యులు చింతకుంట విజయరమణ రావు..

సుల్తానాబాద్ అక్టోబర్ 05 (విజయక్రాంతి): పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణ కేంద్రంలొని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహకారంతో హరే రామ హరే కృష్ణా ట్రస్టు భాగస్వామ్యంతో ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజన కార్యక్రమాన్ని(Midday Meal Program) స్థానిక నాయకులతో కలిసి రాష్ట్ర ప్రభుత్వ విప్, పెద్దపల్లి శాసనసభ్యులు చింతకుంట విజయరమణ రావు ప్రారంభించారు.

ఈ సందర్భంగా ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే విజయరమణ రావు మాట్లాడుతూ...గ్రామీణ ప్రాంతాల్లో తల్లిదండ్రులు ఉదయాన్నే వ్యవసాయ, ఇతర పనులకు వెళ్లిపోతుండటంతో కళాశాలకు వచ్చే విద్యార్థులు ఇబ్బందులు పడుతున్న విషయాన్ని గమనించి రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విద్యార్థులకు అల్పాహారంతో పాటు మధ్యాహ్న భోజనం అందించడం జరుగుతుందని అన్నారు. విద్యార్థుల ఆరోగ్యం, భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  ఈ కార్యక్రమాన్ని చేపట్టారని తెలిపారు.

వారానికి 6 రకాల టిఫిన్న్స్ అల్పాహారం తోపాటు పాలు మరియు మధ్యాహ్న భోజనం అందిస్తున్నట్లు వివరించారు. పెద్దపల్లి నియోజకవర్గంలో ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి ఇప్పటివరకు రూ.70 కోట్లు ఖర్చు చేసినట్లు ప్రభుత్వ విప్ విజయరమణ రావు  తెలిపారు. కాంపౌండ్ వాల్స్, నూతన పాఠశాల భవనాలు, మరుగుదొడ్లు, భవనాల ఆధునీకరణతో పాటు పలు అభివృద్ధి పనులు చేపట్టామన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలు మెరుగుపడటంతో ప్రైవేట్ పాఠశాలల నుంచి కూడా విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లో చేరుతున్నారని పేర్కొన్నారు.

పెద్దపల్లి నియోజకవర్గంలో రూ. 200 కోట్లతో ఇంటిగ్రేటెడ్ పాఠశాల నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయని, ఇప్పటికే పిల్లర్ల నిర్మాణం పూర్తయిందని తెలిపారు. ఏడాది కాలంలో పనులు పూర్తి చేసి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ విద్యార్థుల హాస్టళ్లను ఒకే ప్రాంగణంలో ఏర్పాటు చేసి, అందరికీ సమాన విద్య అందించేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.

విద్యారంగ అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని, విద్యార్థులకు అన్ని విధాలా రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్నం భోజనం పధకాన్ని ఏర్పాటు చేసినందుకు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి పెద్దపల్లి నియోజకవర్గ ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు ఉపాధ్యాయులు, విద్యార్థులు, కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు