సచివాలయంలో వాటర్‌ కట్.. బకాయిలే కారణమా?

05-10-2026 | 01:00pm

తెలంగాణ సచివాలయానికి మంచినీటి సరఫరా (Drinking Water Supply) నిలిచిపోయింది. సుమారు రూ.50 లక్షల వాటర్‌ బిల్లులు బకాయి (Pending Bills) ఉండటంతో నీటిని సరఫరా చేసే ప్రైవేటు కాంట్రాక్టర్లు సరఫరాను నిలిపివేసినట్లు సమాచారం. దీంతో సచివాలయంలోని పలు పేషీల అధికారులు ఉద్యోగులు, సిబ్బందికి కీలక సూచనలు చేశారు. ఎవరి వాటర్‌ బాటిల్స్‌ వారే తెచ్చుకోవాలని సూచించినట్లు తెలుస్తోంది.

సచివాలయానికి నీటిని సరఫరా చేసే నాలుగు ప్రైవేటు ఏజెన్సీలకు సుమారు రూ.50 లక్షల బకాయిలు చెల్లించాల్సి ఉందని సమాచారం. పాత బిల్లులు క్లియర్‌ (Clear) చేస్తేనే వాటర్‌ క్యాన్లను సరఫరా చేస్తామని కాంట్రాక్టర్లు స్పష్టం చేస్తున్నట్లు తెలుస్తోంది. బకాయిల చెల్లింపులపై ప్రభుత్వం నుంచి స్పష్టత రావాల్సి ఉండగా.. అప్పటివరకు సచివాలయంలో నీటి సరఫరాపై ఇబ్బందులు కొనసాగే పరిస్థితి ఏర్పడింది.

మరిన్ని వార్తలు