పోషకాహారంతో వ్యాధులకు దూరం
- డిప్యూటీ డీఎంహెచ్ఓ డాక్టర్ సుధాకర్ నాయక్
- క్షయ వ్యాధిగ్రస్తులకు పోషకాహార కిట్లు అందజేత
మంచిర్యాల క్రైమ్, అక్టోబర్ 5 : క్షయ వ్యాధి నిర్మూలనలో మందులతో పాటు పౌష్టికాహారం, వ్యాధిపై అవగాహన ఎంతో కీలకమని ఉప జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ సుధాకర్ నాయక్(Deputy DMHO Dr. Sudhakar Naik) అన్నారు. క్షయ వ్యాధిగ్రస్తులకు పోషకాహార కిట్లు అందించేందుకు దాతలు, స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావాలని కోరారు. సోమ వారం మంచిర్యాల జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో ఆరోగ్య బోధకుడు అల్లాడి శ్రీనివాస్ కుమారుడు డాక్టర్ సుమిత్ జన్మదినం సందర్భంగా కిట్లను అందజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో ఎన్‌జీవోలు, ఉద్యోగులు, స్వచ్ఛంద కార్యకర్తలు, స్వచ్ఛంద సంస్థల సహకారంతో క్షయ వ్యాధిగ్రస్తులకు పోషకాహార కిట్లు అందించేందుకు కృషి చేయాలన్నారు. మరింత మంది దాతలు స్వచ్ఛందంగా ముందుకొచ్చి కిట్లు అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి ఆర్‌ఎంఓ డాక్టర్ శ్రీధర్, పదవీ విరమణ చేసిన ఆర్‌ఎంఓ డాక్టర్ భీష్మ, జిల్లా మాస్ మీడియా అధికారి బుక్క వెంకటేశ్వర్, ఆరోగ్య బోధకులు అల్లాడి శ్రీనివాస్, నాందేవ్ శ్రీనివాస్, క్షయవ్యాధి నియంత్రణ సిబ్బంది, వైద్యులు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.