రెనివల్ చేయుటకు కమిటీ

05-10-2026 | 08:33pm

ఘట్ కేసర్,(విజయక్రాంతి): మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి(MLA Chamakura Malla Reddy) ఆదేశానుసారం బిఆర్ఎస్ నాయకులు, మాజీ ఎంపీపీ  బండారి శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో రాబోయే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల(Graduate MLC elections) నేపథ్యంలో ఎన్నికల్లో పార్టీ శ్రేణులకు సంసిద్ధం  చేయుటకు సోమవారం సమావేశం ఏర్పాటు చేశారు.

ఈ సమావేశంలో పట్టభద్రుల ఓటర్ లిస్టు, కొత్త ఓటర్లను నమోదు చేయుటకు ఒక కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీ ద్వారా పాత ఓటర్లను రెనివల్ చేయుటకు కొత్త ఓటరు నమోదు చేయుటకు ప్రతి ఒక్క బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ఓటర్ నమోదు చేయాలని తీర్మానం చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, మాజీ ప్రజా ప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు