ఘనంగా ప్రపంచ వెదురు బొంగుల దినోత్సవ వేడుకలు
18-09-2026 | 07:15pm
కలెక్టర్ కు వెదురు వస్తువులు, వినతిపత్రం అందజేత
భూపాలపల్లి టౌన్, సెప్టెంబర్ 18 (విజయక్రాంతి): జయశంకర్ భూపాలపల్లి జిల్లా బీసీ సంక్షేమ అధికారి ఇందిర(BC Welfare Officer Indira) ఆధ్వర్యంలో శుక్రవారం ప్రపంచ వెదురు బొంగుల దినోత్సవాన్ని(World Bamboo Day) కలెక్టరేట్ ఆవరణలో ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా మహేంద్ర కుల పెద్దలు, భూపాలపల్లి మండల అధ్యక్షులు గైని చంద్రశేఖర్, గణపురం మండల అధ్యక్షులు చందా ప్రసాద్, జిల్లా మహిళా అధ్యక్షురాలు బూర పద్మ ఆధ్వర్యంలో కలెక్టర్ రాహుల్ శర్మకు వెదురుతో చేసిన వస్తువులతో పాటు వినతిపత్రం అందజేసి వెదురు దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. కలెక్టర్ సానుకూలంగా స్పందించి మేదరి కులస్తులకు అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తానని హామీ ఇచ్చినట్లు వారు పేర్కొన్నారు.