నూకల జానకి మృతి అత్యంత బాధాకరం
కోదాడ ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి
హుజూర్ నగర్, సెప్టెంబర్ 18: తెలంగాణ ఉద్యమ మహిళ సంఘం హుజూర్ నగర్ నియోజకవర్గ అధ్యక్షురాలు, రిటైర్డ్ ఉపాధ్యాయురాలు నూకల జానకి మృతి చెందడం అత్యంత బాధాకరమని కోదాడ ఎమ్మెల్యే, శాసనసభ ఎస్టిమేట్ కమిటీ చైర్మన్ నలమాద ఉత్తమ్ పద్మావతి(MLA Uttam Padmavathi) అన్నారు. పట్టణానికి చెందిన సీనియర్ జర్నలిస్టు నూకల నరేందర్ రెడ్డి సతీమణి నూకల జానకి ఇటీవల ఆనారోగ్యంతో మృతి చెందారు.
శుక్రవారం పట్టణంలోని శ్రీమన్నారాయణ కాలనీలో వారి నివాసానికి వెళ్లి బాధిత కుటుంబాన్ని పరామర్శించి నివాళులర్పించారు. నూకలనరేందర్ రెడ్డి కుటుంబానికి అండగా ఉంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ దొంతగాని శ్రీనివాస్,మున్సిపల్ వైస్ చైర్మన్ తన్నీరు మల్లికార్జున్,పట్టణ అధ్యక్షుడు గెల్లి రవి,టియుడబ్ల్యూజే జిల్లా అధ్యక్షుడు కోల నాగేశ్వరరావు, రాజా రమేష్,విక్రమ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.