ప్రభుత్వ కళాశాలలో అవగాహన సదస్సు.. ఎస్సై విజయ్
18-09-2026 | 08:45pm
బెజ్జూర్ సెప్టెంబర్ 18 (విజయక్రాంతి): బెజ్జూరు మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఎస్సై విజయ్(SI Vijay) ప్రత్యేక అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు. విద్యార్థులు చదువుపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని సూచించారు. డ్రగ్స్, గంజాయి, సిగరెట్, మత్తు పానీయాలకు దూరంగా ఉండాలని సూచించారు. చెడు వ్యసనాలకు బానిసైతే జీవితాలు నాశనం అవుతాయని అన్నారు. ఉపాధ్యాయులు బోధించే విధానంను అర్థం చేసుకొని మంచిగా చదవాలని పరీక్షల్లో మంచి ఫలితాలు సాధించేందుకు ఇప్పటినుండి శ్రద్ధ చూపాలని విద్యార్థులకు సూచించారు.