పౌష్టికాహారాన్ని అందించడంలో తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకోవాలి

18-09-2026 | 08:47pm

గణపురం, సెప్టెంబర్ 18 (విజయక్రాంతి): పౌష్టికాహారాన్ని అందించడంలో తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకోవాలని పరశురాంపల్లి సర్పంచ్ ఉడుత సాంబయ్య యాదవ్(Sarpanch Uduta Sambaiah Yadav) అన్నారు. పోషణమాసం సందర్భంగా శుక్రవారం జంగుపల్లి అంగన్‌వాడీ కేంద్రంలో పోషణ మాసం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. పరశురాంపల్లి సర్పంచ్ ఉడుత సాంబయ్య యాదవ్ ముఖ్య అతిథిగా హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం చిన్నారులకు పోషకాహార పదార్థాలు, అల్పాహారం పంపిణీ చేశారు.

మరిన్ని వార్తలు