పెన్షనర్లు డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్‌పై అవగాహన కలిగి ఉండాలి

11-11-2026 | 07:21pm

ఎస్ఓ టు జీఎం రామన్ వి పాఠక్ 

భూపాలపల్లి టౌన్, నవంబర్ 11 (విజయక్రాంతి) : సింగరేణి పెన్షనర్లు డిజిటల్ సర్టిఫికెట్ పై అవగాహన కలిగి ఉండాలని సింగరేణి భూపాలపల్లి ఏరియా ఎస్ఓటు జీఎం రామన్ వి పాఠక్(GM Raman V Pathak) అన్నారు. స్థానిక క్రిష్ణకాలనీ మినీ ఫంక్షన్ హాలులో బుధవారం ఏర్పాటు చేసిన డిజిటల్ సర్టిఫికెట్ క్యాంపులో వారు ముఖ్య అతిధిగా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం చేపట్టిన డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్ 5.0 కార్యక్రమంలో భాగంగా పెన్షనర్లు కార్యాలయాలకు వెళ్లే అవసరం లేకుండా తమ స్మార్ట్ ఫోన్ ద్వారా ఫేస్ ఆథెంటికేషన్ విధానంలో జీవన్ ప్రమాణ్ యాప్ సహాయంతో లైఫ్ సర్టిఫికెట్‌ను సమర్పించవచ్చని వివరించారు. నవంబర్ 1 నుంచి 30వ తేదీ వరకు పెన్షనర్లు తమ డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్లను సమర్పించాలని అన్నారు.

అందులో భాగముగా బుధ, గురువారం రెండు రోజులపాటు ఏర్పాటు చేసిన డిజిటల్ సర్టిఫికెట్ క్యాంపును ఏరియాలోని పెన్షనర్లు సద్వినియోగం చేసుకోవాలని ఆయన  కోరారు. అనంతరం పలువురు పెన్షనర్లకు డిజిటల్ సర్టిఫికెట్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఏరియా పర్సనల్ మేనేజర్ ఎస్ శ్యామ్ సుందర్, సీనియర్ పర్సనల్ ఆఫీసర్ విశ్రాంత్ కుమార్, సీఎంపీఎఫ్ అధికారులు సెక్షన్ ఆఫీసర్ ఎం శ్రీధర్, సీనియర్ ఎస్ఎస్ఏ కె వెంకట్ రెడ్డి, ఏ‌ఐటియూ‌సి నాయకులు జి శ్రీనివాస్, ఐ‌ఎన్‌టీయూ‌సి నాయకులు బి మధూకర్ రెడ్డి, అసిస్టెంట్ సూపరింటెండెంట్ మల్లేపల్లి రవి తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు