మహా పాదయాత్రను విజయవంతం చేయాలి

11-11-2026 | 07:28pm
  1. ఎస్‌ఐఆర్‌పై ప్రతిపక్షాల దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలి
  2. బీజేపీ మండల అధ్యక్షుడు బైరెడ్డి రమణారెడ్డి పిలుపు

హుజురాబాద్, నవంబర్ 11: (విజయక్రాంతి): ఎస్‌ఐఆర్‌(Comprehensive Electoral Roll Revision List) (ఓటరు సమగ్ర సవరణ జాబితా)పై కాంగ్రెస్‌తో పాటు ఇతర ప్రతిపక్షాలు చేస్తున్న దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలని బీజేపీ ఇల్లందకుంట మండల అధ్యక్షుడు బైరెడ్డి రమణారెడ్డి పిలుపునిచ్చారు. కరీంనగర్‌లో నిర్వహించనున్న మహా పాదయాత్రను పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.

బుధవారం ఇల్లందకుంట మండల కేంద్రంలో బైరెడ్డి రమణారెడ్డి అధ్యక్షతన బీజేపీ ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా కార్యదర్శి సంపెల్లి సంపత్‌రావు మాట్లాడుతూ.. ఎస్‌ఐఆర్‌ విషయంలో కాంగ్రెస్ పార్టీ అనవసర రాద్ధాంతం చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తోందని విమర్శించారు.

బీజేపీని రాజకీయంగా ఎదుర్కోలేక తప్పుడు ప్రచారాలకు పాల్పడుతోందని ఆరోపించారు. కాంగ్రెస్ రాజకీయ కుట్రలను ప్రజల్లో ఎండగట్టేందుకు మహా పాదయాత్ర నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారని వెల్లడించారు. మండల అధ్యక్షుడు బైరెడ్డి రమణారెడ్డి మాట్లాడుతూ.. పార్టీ నాయకులు, కార్యకర్తలు, యువత పెద్ద సంఖ్యలో తరలివచ్చి పాదయాత్రను విజయవంతం చేయాలని కోరారు. సమావేశంలో మండల ప్రధాన కార్యదర్శి గుత్తికొండ రాంబాబు, ఉప్పుల రమేష్, కంకణాల రవీందర్‌రెడ్డి, తుపాకుల సతీష్ తదితర బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు