రైతు గర్జన సభను జయప్రదం చేయండి
ములకలపల్లి, నవంబర్ 11 (విజయక్రాంతి): ఈ నెల 15న నల్గొండలో జరిగే రైతు గర్జన సభలో రైతులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు అన్నవరపు కనకయ్య(CPM state committee member Annavarapu Kanakaiah) కోరారు. బుధవారం మండల కేంద్రము లోని సిపిఎం కార్యాలయంలో పోడియం వెంకటేశ్వర్లు అధ్యక్షతన జరిగిన పార్టీ మండల కమిటీ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు.
పోరాటాల గడ్డ నల్లగొండ లో ఈ నెల 15 తేదీ నుంచి 18 తేదీ వరకు అఖిల భారత కిసాన్ సభ జాతీయ మహాసభలు జరుగనున్నాయని మొదటి రోజు 15వ తేదీన లక్ష మందితో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారని రైతులు, కార్మికులు,వ్యవసాయ కార్మికులు ఐక్యంగా నల్లగొండ సభకు వేలాదిగా కదిలి రావాలని పిలుపునిచ్చారు.దేశంలోని బిజెపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వ్యవసాయ రంగాన్ని సంక్షోభంలోకి నెడుతుందని విమర్శించారు.రైతులు పండించిన పంటలకు సరైన గిట్టుబాటు ధర లేక దేశంలోని రైతాంగం తీవ్రంగా నష్టపోతుందని అన్నారు.
ఈ రోజు దేశానికి అన్నం పెట్టే రైతన్న ఆర్థికంగా చితికి పోయి తెచ్చిన అప్పులు తీర్చలేక అప్పుల బాధలు భరించలేక కొందరు రైతులు ఆత్మ హత్యల పాలవుతున్నారని అన్నారు. రైతులు పండించిన పంటకు కనీస మద్దతు ధర కల్పించాలని డిమాండ్ చేశారు. ఎరువులు విత్తనాలను సబ్సిడీ ద్వారా అందించాలని డిమాండ్ చేశారు. సీతారామ ప్రాజెక్టు కెనాల్ కాలువలకు లింక్ డిస్ట్రిబ్యూటర్ కెనాల్ కాలువలు వెంటనే నిర్మించి జిల్లా రైతాంగానికి సాగు నీరు అందించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి ముదిగొండ రాంబాబు, మాలోతు రావూజ, నిమ్మల మధు, గుగులోతు దేవేందర్,వర్షా శ్రీరాములు,బైరు ప్రసాద్,కుంజా రాంమూర్తి,గోపగాని లక్ష్మీ నరసయ్య,గుగులోతు రవీందర్, కోండ్రు రాఘవయ్య, గడ్డం వెంకటేశ్వర్లు,మడకం మల్లేష్, తదితరులు పాల్గొన్నారు.