సీనియర్ సిటిజన్లే సమాజానికి దిక్సూచి

11-11-2026 | 07:16pm

రాజయోగ ధ్యానంతో మానసిక ప్రశాంతత: బ్రహ్మకుమారి కల్పన

హుజురాబాద్,నవంబర్11: (విజయక్రాంతి): వృద్ధాప్యం జీవితానికి ముగింపు కాదని, అనుభవాల సంపదతో సమాజానికి మార్గదర్శకులుగా నిలవాలని బ్రహ్మకుమారి కల్పన(Brahmakumari Kalpana) అన్నారు. బ్రహ్మకుమారీస్ సామాజిక సేవా విభాగం, కేంద్ర సామాజిక న్యాయ శాఖ(Union Ministry of Social Justice) సంయుక్తంగా చేపట్టిన ‘సంగం’ కార్యక్రమంలో భాగంగా హుజురాబాద్‌లో నిర్వహించిన సదస్సులో ఆమె మాట్లాడారు.

వయసు పెరిగినా ఆత్మవిశ్వాసం, ఉత్సాహం తగ్గించుకోవద్దని సూచించారు. ప్రతిరోజూ 15 నిమిషాలు రాజయోగ ధ్యానం చేయడంతో మానసిక ప్రశాంతత లభిస్తుందని, సాత్విక ఆహారం, వ్యాయామం, సానుకూల ఆలోచనలతో ఆరోగ్యకరమైన జీవనం సాధ్యమని తెలిపారు. అనంతరం సీనియర్ సిటిజన్లను సన్మానించారు. కార్యక్రమంలో కేంద్ర ఇన్‌చార్జి శ్రీవాణి, గుంటి రాజయ్య, శివనాధుని ఈశ్వరయ్య, జ్యోతిరాణి తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు