ఘనంగా జాతీయ విద్యా దినోత్సవ వేడుకలు

11-11-2026 | 07:28pm

తంగళ్ళపల్లి, నవంబర్ 11 (విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లా తంగాలపల్లి మండలం భారతదేశ విద్యారంగ అభివృద్ధికి మౌలానా అబుల్ కలాం ఆజాద్(Maulana Abul Kalam Azad) చేసిన సేవలు ఎప్పటికీ మరువలేనివని మైనార్టీ బాలికల పాఠశాల, కళాశాల ప్రిన్సిపల్ ఉరుసా ఫాతిమా అన్నారు. మౌలానా ఆజాద్ జయంతిని పురస్కరించుకుని నవంబర్ 11న జాతీయ విద్యా దినోత్సవాన్ని తంగళ్లపల్లి మండలంలోని మైనార్టీ బాలికల పాఠశాల, కళాశాలలో ఘనంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆజాద్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. విద్యార్థినులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు, ప్రసంగాలు, పాటలు, నృత్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ సందర్భంగా ఉరుసా ఫాతిమా మాట్లాడుతూ.. దేశ తొలి విద్యాశాఖ మంత్రిగా మౌలానా ఆజాద్ విద్యాభివృద్ధికి విశేష కృషి చేశారని, ప్రతి ఒక్కరికీ నాణ్యమైన విద్య అందించాలనే లక్ష్యంతో పనిచేశారని కొనియాడారు. ఆయన ఆశయాలను ఆదర్శంగా తీసుకుని విద్యార్థినులు క్రమశిక్షణతో చదువుతూ ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో పాఠశాల, కళాశాల అధ్యాపకులు, ఉపాధ్యాయులు, విద్యార్థినులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు