బాల్యవివాహాలు లేని సమాజ నిర్మాణమే లక్ష్యం
100 రోజుల విస్తృత ప్రచారం కార్యక్రమంలో తిరుపతి శాస్త్రాల
భూపాలపల్లి / రేగొండ, నవంబర్ 06 ( విజయక్రాంతి ) : బాల్య వివాహాలు(Child Marriages) లేని సమాజ నిర్మాణమే తమ లక్ష్యమని తిరుపతి శాస్త్రాల అన్నారు. బాల్యవివాహాలు, బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనతో(Eradication of Child Labour) పాటు ప్రతి చిన్నారికి విద్య, రక్షణ, భద్రత(Education, defense, security) కల్పించాలనే లక్ష్యంతో జస్ట్ రైట్స్ ఫర్ చిల్డ్రన్(Just Rights for Children), షేర్ ఎన్జీవో ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా 28 రాష్ట్రాల్లో 100 రోజుల విస్తృత అవగాహన ప్రచార కార్యక్రమం నిర్వహిస్తున్నారు.
అందులో భాగముగా షేర్ ఎన్జీఒ డైరెక్టర్ గోపాల్ రెడ్డి, జిల్లా ప్రాజెక్టు కోఆర్డినేటర్ తిరుపతి శాస్త్రాల ఆధ్వర్యంలో శుక్రవారం రేగొండ మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆశా వర్కర్స్ డే కార్యక్రమం నిర్వహించగా డీఎంహెచ్ఓ మధుసూదన్ ముఖ్య అతిధిగా పాల్గొని బాల్య వివాహాల నిర్మూలనకు సంబంధించిన గోడ పత్రికలు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆశా కార్యకర్తలు, సూపర్వైజర్లకు బాల్యవివాహాల నిర్మూలనపై అవగాహన కల్పించి, గ్రామాలు, పట్టణాల్లో ప్రజలకు బాల్యవివాహాల వల్ల కలిగే అనర్థాలను వివరించాలని సూచించారు.
ఈ సందర్భంగా జస్ట్ రైట్స్ ఫర్ చిల్డ్రన్ జిల్లా ప్రాజెక్టు కో ఆర్డినేటర్ తిరుపతి శాస్త్రాల మాట్లాడుతూ బాల్యం బడిలోనే వికసించాలని, బాలికల భవిష్యత్తుకు బాల్యవివాహాలు అడ్డుకాకూడదని అన్నారు. చిన్నారుల హక్కులను కాపాడటం సమాజంలోని ప్రతి ఒక్కరి బాధ్యత అని, బాల్యవివాహాలు లేని సమాజ నిర్మాణం కోసం ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కోరారు.