అబ్దుల్ నగరంలో అర్ధరాత్రి దొంగల హల్ చల్
08-10-2026 | 10:45pm
- 4 గొర్రెలు ఎత్తుకెళ్లిన దుండగులు
తరిగొప్పుల,(విజయక్రాంతి): మండలంలోని అబ్దుల్ నగరం గ్రామం(Abdul Nagaram Village)లో అర్ధరాత్రి గొర్రెల దొంగలు(Sheep Theft) రెచ్చిపోయారు. గ్రామానికి చెందిన భాషబోయిన నర్సయ్య అనే రైతు రోజూ మాదిరిగానే తన గొర్రెలు, మేకలను ఇంటి ముందున్న పాకలో కట్టేసి నిద్రపోయాడు. బుధవారం రాత్రి సుమారు 2 గంటల సమయంలో గుర్తుతెలియని దుండగులు వచ్చి 3 మేకలు, ఒక గొర్రెను ఎత్తుకెళ్లారు. ఉదయం లేచి చూసేసరికి పాకలో గొర్రెలు కనిపించకపోవడంతో బాధితుడు లబోదిబోమన్నాడు. వెంటనే తరిగొప్పుల పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. ఎస్సై శ్రీదేవి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.