రెండు ఇసుక ట్రాక్టర్లను పట్టుకున్న పోలీసులు

08-10-2026 | 11:53pm

భూత్పూర్: అక్రమ ఇసుక రవాణా(Illegal Sand Transport) చేస్తున్న రెండు ట్రాక్టర్లను పట్టుకున్నట్లు ఎస్సై నాగన్న తెలిపారు. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ  గురువారం ఉదయం 6 గంటలకు భూత్పూర్ గ్రామ శివారులోని భారత్ పెట్రోల్ బంక్ సమీపంలో బీట్ డ్యూటీ చేస్తున్న పోలీసులకు అటుగా వెళ్తున్న రెండు ఇసుక లోడు ట్రాక్టర్లను పట్టుకొని పోలీస్  స్టేషన్కు తరలించారు. ట్రాక్టర్ డ్రైవర్లు మొల్గర కురుమయ్య, మొల్గర పెద్ద ఖాదర్ లు ఎలాంటి అనుమతి పత్రాలు లేకుండా వాగు నుండి ఇసుకను అక్రమంగా తరలిస్తున్నట్లు ఆయన తెలిపారు. ట్రాక్టర్ డ్రైవర్ల పై కేసు నమోదు చేశామని అన్నారు. ఎవరైనా అనుమతులు లేకుండా అక్రమ ఇసుక రవాణా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.

మరిన్ని వార్తలు