ప్రభుత్వ నిధులుగా ప్రచారం చేయడం సరికాదు

09-10-2026 | 12:08am

* బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి ఖమ్మం వేంకటేశం

కోహెడ,(విజయక్రాంతి): దేవాలయాల అభివృద్ధి(Temple development) కోసం భక్తులు,దాతలు సమకూర్చిన నిధులను రాష్ట్ర ప్రభుత్వ నిధులుగా ప్రచారం చేసుకోవడం కాంగ్రెస్(BRS) నాయకులకు సరికాదని.. బిజెపి సిద్దిపేట జిల్లా ప్రధాన కార్యదర్శి ఖమ్మం వేంకటేశం అన్నారు. గురువారం స్థానిక విలేకరులతో ఆయన మాట్లాడుతూ.. హుస్నాబాద్ నియోజకవర్గంలోని కొత్తకొండ శ్రీ వీరభద్రస్వామి ఆలయానికి(Kothakonda Sri Veerabhadraswamy Temple) రూ.3.80 కోట్లు, పొట్లపల్లి శ్రీ రాజరాజేశ్వరస్వామి ఆలయానికి రూ.1.50 కోట్లు, హుస్నాబాద్ శ్రీ రేణుక ఎల్లమ్మ దేవస్థానానికి రూ.85 లక్షలు ప్రభుత్వం నుంచి మంజూరైనట్లు  ప్రచారాన్ని తీవ్రంగా ఖండించారు.

ఎండోమెంట్ శాఖ పరిధిలోని ఆయా దేవాలయాల బ్యాంకు ఖాతాల్లో ఉన్న ఫిక్స్‌డ్ డిపాజిట్లు ఇతర నిధులు ఆయా ఆలయాలకు చెందినవేనని స్పష్టం చేశారు. భక్తులు దాతలు ఎన్నో సంవత్సరాలుగా సమర్పించిన విరాళాలు, కానుకలతో సమకూరిన ఆలయ నిధులను రాష్ట్ర ప్రభుత్వ నిధులుగా చూపించడం వాస్తవాలను వక్రీకరించడమేనన్నారు. ప్రభుత్వ ఖజానను కేటాయించి ఉంటే.. ఆలయాల బ్యాంకు ఖాతాల్లో ఎంత మొత్తంలో నిధులు ఉన్నాయి? ఆ నిధులు ఎక్కడి నుంచి సమకూరాయి, ప్రభుత్వం ఎంత మొత్తాన్ని తన బడ్జెట్ నుంచి కేటాయించింది ? ప్రస్తుతం ఆలయాల నిధుల్లో నుంచి ఎంత మొత్తాన్ని అభివృద్ధి పనులకు వినియోగిస్తున్నారు.. అనే అంశాలపై రాష్ట్ర ప్రభుత్వం పూర్తి వివరాలతో శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

మరిన్ని వార్తలు