షాపింగ్ రద్దీ దృష్ట్యా ట్రాఫిక్ ఆంక్షలు

09-10-2026 | 12:06am

- ట్రాఫిక్ ఏసీపీ సుమన్ కుమార్

సిద్దిపేట క్రైం,(విజయక్రాంతి): రాబోయే బతుకమ్మ(Bathukamma), దసరా(Dasara) పండుగల సందర్భంగా సిద్దిపేట పట్టణంలోని సుభాష్ రోడ్డులో రద్దీ దృష్ట్యా ట్రాఫిక్‌ ఆంక్షలు విధిస్తున్నట్లు ట్రాఫిక్‌ ఏసీపీ ఎం.సుమన్ కుమార్(Traffic ACP M. Suman Kumar) తెలిపారు. బతుకమ్మ, దసరా పండుగలు పూర్తయ్యే వరకు సుభాష్ రోడ్డులో ఆటోలు, కార్లు, ఇతర నాలుగు చక్రాల వాహనాలకు ఉదయం 9 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు అనుమతించబోమని స్పష్టం చేశారు.

టూవీలర్ వాహనాలను మాత్రమే అనుమతిస్తామని తెలిపారు. అలాగే దుకాణాల ముందు పార్కింగ్ లేకుండా చూసుకునే బాధ్యత వ్యాపారులదేనని పేర్కొన్నారు. షాపింగ్ కోసం సుభాష్ రోడ్డుకు వచ్చే ప్రజలు  అనుమతించిన ప్రదేశాలలో మాత్రమే తమ వాహనాలను పార్కింగ్ చేయాలని సూచించారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

మరిన్ని వార్తలు