మండల మైనార్టీ అధ్యక్షులుగా షేక్ అబ్దుల్ కలీం
08-10-2026 | 11:59pm
జిల్లా మైనార్టీ ప్రధాన కార్యదర్శిగా మొహమ్మద్ అబ్రాల్ నియామకం
బోథ్,(విజయక్రాంతి): మండల మైనార్టీ అధ్యక్షునిగా షేక్ అబ్దుల్ అలీమ్(Sheikh Abdul Aleem) నియమించినట్లు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మెరుగు భోజన్న తెలిపారు. అంతేగాక ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ(Congress Party) మైనార్టీ నూతన పదవులను ప్రకటించడంతో అందులో జిల్లా మైనార్టీ ప్రధాన కార్యదర్శిగా మహమ్మద్ అబ్రార్ కు చోటు లభించింది అన్నారు. మండలంలో జిల్లాలో కాంగ్రెస్ పార్టీ పటిష్టత కోసం ఇరువురు నాయకులు కృషి చేయాలని ఆయన పేర్కొన్నారు. కష్టపడి పని చేసిన వారికి పార్టీలో పదవులు లభిస్తాయి అన్నారు.