తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రత్యేక బతుకమ్మ
సిపిఐ ఆధ్వర్యంలో యాదగిరిగుట్టలో బతుకమ్మ సంబరాలు
యాదగిరిగుట్ట,(విజయకాంతి): భారత కమ్యూనిస్టు పార్టీ(Communist Party of India) ఆధ్వర్యంలో గురువారం యాదగిరిగుట్ట సిపిఐ కార్యాలయం ముందు బతుకమ్మ సంబరాలు(Bathukamma Festival) ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బండి జంగమ్మ మాట్లాడుతూ... తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాల ప్రతీక బతుకమ్మ అని, బతుకమ్మ బతుకమ్మ అని పడే పాటల్లో మహిళల కష్ట సుఖాలు, ప్రేమ, స్నేహం, బంధుత్వం ఉంటుందని అన్నారు.
ఈ కార్యక్రమంలో మహిళ జిల్లా ప్రధాన కార్యదర్శి బండి జంగమ్మ, మహిళ సమైక్య నాయకురాలు ఆరె పుష్ప, మూనుకుంట్ల నరసమ్మ, మద్దూరు భాగ్యమ్మ, మాజీ మున్సిపల్ కౌన్సిలర్ బబ్బురి మౌనిక , రావుల విజయలక్ష్మి,గుజ్జ శశికళ చంద్రకళ, రేణుక, లక్ష్మీ, వీరమని మహిళలు తదితరులు పాల్గొన్నారు.