యాదవుల ఐక్యతే బలం... రాజకీయాల్లో రాణించాలి
మంథనిలో యాదవ మహాసభ విస్తృత సమావేశంలో జిల్లా అధ్యక్షుడు మేకల మల్లేష్ యాదవ్
మంథని,(విజయక్రాంతి): యాదవులు ఐక్యంగా ముందుకు సాగుతూ రాజకీయంగా, సామాజికంగా ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని అఖిల భారత యాదవ మహాసభ పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు మేకల మల్లేష్ యాదవ్, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ సందనవేన రాజేందర్ యాదవ్ పిలుపునిచ్చారు. గురువారం మంథని పట్టణంలో నిర్వహించిన అఖిల భారత యాదవ మహాసభ మంథని మండల విస్తృత స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు.
ఈ సందర్భంగా మంథని మండల నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మంథని టౌన్ అధ్యక్షునిగా మిరియాల శ్రావణ్ యాదవ్, యువజన అధ్యక్షుడు, యువజన ప్రధాన కార్యదర్శి తదితర పదవులకు నూతన నాయకులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. నూతన కార్యవర్గ సభ్యులను జిల్లా అధ్యక్షుడు మల్లేష్ యాదవ్, వర్కింగ్ ప్రెసిడెంట్ రాజేందర్ యాదవ్, జిల్లా నాయకులు తొట్ల తిరుపతి యాదవ్ పర్ష బక్కన్న యాదవ్ ఉడత పర్వతాలు యాదవులు శాలువాలు కప్పి, పూలమాలలతో సత్కరించి అభినందించారు.
జిల్లా అధ్యక్షుడు మేకల మల్లేష్ యాదవ్ మాట్లాడుతూ యాదవుల ఐక్యతే సంఘం బలోపేతానికి ప్రధాన బలమన్నారు. సమాజ హక్కుల సాధన కోసం నాయకులు, యువత సమన్వయంతో పనిచేయాలని సూచించారు. గ్రామస్థాయి నుంచి యాదవ సంఘాన్ని మరింత బలోపేతం చేస్తూ యువతను సంఘ కార్యక్రమాల్లో భాగస్వాములను చేయాలని పిలుపునిచ్చారు.
మంథని మండలంలో యాదవ మహాసభను మరింత బలోపేతం చేసి యాదవుల సంక్షేమం, హక్కుల సాధన కోసం నిరంతరం కృషి చేస్తామని నూతన కార్యవర్గ నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా యాదవ సంఘం నాయకులు తొట్ల తిరుపతి యాదవ్, పెగడ రమేష్ యాదవ్, పర్ష బక్కయ్య యాదవ్, ఉడుత పర్వతాలు యాదవ్, యాదవ్ తదితరులతో పాటు మండలంలోని యాదవ సంఘం నాయకులు, యువకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.