పేదల ఇళ్లు పేదలకే ఇవ్వాలి: సిపిఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ
11-09-2026 | 10:57pm
జనగామ,(విజయక్రాంతి): జనగామలో మూడో విడత ఇందిరమ్మ స్థలాలను, జంట పడక గదుల ఇళ్లను సిపిఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ(CPM State Secretary John Wesley) పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 2012లో 1144 మంది పేదలకు పట్టాలు ఇచ్చి వదిలేశారని, పేదలు అప్పులు చేసి ఇళ్లు కట్టుకుంటే కనీస సౌకర్యాలు కల్పించలేదని అన్నారు. 2019లో అధికారులే లేఅవుట్ వేసి, 2023లో 72 మందికి డ్రా తీసి ఇళ్లు కేటాయించారని, ఇప్పుడు మళ్లీ డ్రా అనడం సరికాదని అన్నారు. పేదల ఇళ్లను పేదలకే ఇవ్వాలని డిమాండ్ చేశారు.