స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ పోటీలకు హాజరైన జగిత్యాల ఎమ్మెల్యే

30-10-2026 | 08:04pm

జగిత్యాల,(విజయక్రాంతి): జగిత్యాల పట్టణంలోని వివేకానంద మినీ స్టేడియం(Vivekananda Mini Stadium)లో 70వ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ రాష్ట్ర స్థాయి కరాటే టోర్నమెంట్(70th School Games Federation State Level Karate Tournament), సెలక్షన్స్ 2026–27 కార్యక్రమంలో భాగంగా కరాటే పోటీలకు జగిత్యాల శాసనసభ్యులు డా. సంజయ్ కుమార్(MLA Sanjay Kumar) హాజరై విజేతలకు బహుమతులు మెడల్స్ ప్రదానం చేసి  క్రీడాకారులను అభినందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ మాట్లాడుతూ విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలని, క్రీడలు శారీరక దృఢత్వంతో పాటు క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తాయని అన్నారు.

జిల్లా స్థాయి పోటీల్లో ప్రతిభ కనబరిచి రాష్ట్ర, జాతీయ స్థాయిలో జగిత్యాల జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని క్రీడాకారులకు ఆకాంక్షించారు. సమయం అందరికీ సమానంగా ఉంటుందని దాన్ని సద్వినియోగం చేసుకున్న వారికి ఉత్తమ ఫలితాలు పొందుతారని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం క్రీడల అభివ్రుద్ది కి కృషి చేస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ అరవ లక్ష్మీ, టెక్నికల్ శ్రీను బాబు, కరాటే ప్రధాన కార్యదర్శి అరుముల్ల పవన్, ఎస్ జి ఎఫ్ కార్యదర్శి చక్రధర్ రావు, అబ్జర్వార్ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు