ఠంయాల శ్రీధరాచార్యులు జాతీయ స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం

12-09-2026 | 07:40pm

హనుమకొండ (విజయక్రాంతి): వరంగల్ కు చెందిన ప్రముఖ వ్యాఖ్యాత, గాయకులు, తెలంగాణ రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు(Best Teacher Award) గ్రహీత ఠంయ్యాల శ్రీధరాచార్యులను జీసీఎస్ వల్లూరి ఫౌండేషన్ ఆధ్వర్యంలో వినాయక చవితి(Vinayaka Chavithi), ఉపాధ్యాయ దినోత్సవం పూరస్కరించుకొని రవింద్రభారతి (Ravindra Bharati) మెయిన్ హాల్ లో జరిగిన కార్య క్రమంలో జాతీయ స్ధాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు అందచేస్తు సత్కరించింది. విద్యా, సాహిత్య, సాంస్కృతిక రంగాలలో వారు అందచేసిన, అందచేస్తున్న సేవలను గుర్తించి ఈ అవార్డు అందచేసారు.

జీ సీ ఎస్ వల్లూరి ఫౌండేషన్ జాతీయ చైర్మన్ వీ.శ్రీనీవాసా రాజు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఎమ్ ఎల్ సీ , ప్రోఫెసర్ డాక్టర్ కోదండ రామ్, సినీ నటులు, మాజీ మంత్రి బాబుమోహన్, మాజీ కేంద్ర మంత్రి సముద్రాల వేణు గోపాలచారి, సరస్వతి ఉపాసకులు దైవఙశర్మ చేతులమీదుగా ఠంయ్యాల ఈ అవార్డు స్వీకరించారు.ఈ కార్యక్రమానికి ఠంయ్యాల వ్యాఖ్యతగా, గాయకులుగా వ్యవహరించారు. పసందైన మాటలతో సందర్భానికి తగిన పాటలతో అందరిని అలరిస్తారని దేవుడిచ్చిన వరం వారి స్వరం అని ఫౌండేషన్ చైర్మన్ వీ.శ్రీనీవాసారాజు  అతిధులు ఠంయ్యాలను అభినందించారు.ఉభయ తెలుగు రాష్టాలలోని  వందకు పైగావిభిన్న  రంగాలలో విశేష సేవలందిస్తున్న వారికి అవార్డులు అందచేసి సత్కరింఛారు.అతిధులంతా వల్లూరి ఫౌండేషన్ చైర్మన్ శ్రీనీవాసా రాజు చేస్తున్న కృషి ని అభినందించారు.

మరిన్ని వార్తలు