కొమరం భీమ్ కు నివాళులర్పించిన ఆదివాసీ నేతలు

30-10-2026 | 08:03pm

ఇల్లెందు టౌన్,(విజయక్రాంతి): ఇల్లందు(Illandu)  మండలం కరెంట్ ఆఫీస్ సెంటర్ లో కొమరం భీమ్  వర్ధంతి కార్యక్రమాన్ని(Komaram Bheem's Death Anniversary) కొమరం భీమ్ విజ్ఞానకేంద్రం  వ్యవస్థాపకులు పూనెం కోటయ్య ఆధ్వర్యంలో కొమరం భీమ్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. ఈ సందర్భంగా పూనెం కోటయ్య  మాట్లాడుతూ, నిజం పాలనకు వ్యతిరేకంగా పోరాడిన ఆయన త్యాగాలను స్మరించుకుంటూ జల్ -జంగిల్- జమీన్ అనే నినాదంతో ఆదివాసి గిరిజనుల హక్కుల(Rights of Adivasi tribal people) కోసం పోరాడిన కొమురం భీమ్ జీవితం నేటి తరానికి స్ఫూర్తిదాయకమన్నారు.

ఆదివాసీల సమగ్ర అభివృద్ధి కోసం ఏర్పాటు చేసిన 1/70, పేసా, అలాగే అడివి హక్కుల చట్టాన్ని, పగడ్బందీగా అమలు చేయాలన్నారు.  ఆదివాసి చట్టాలు, హక్కులు, సాంస్కృతి సంప్రదాయాలు పరిరక్షణ కోసం ఆదివాసిలు పోరాటాలు చెయ్యాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సుర్నపాక హనుమంత్, మచ్చ రామారావు, మణి బోతుల  అఖిల్, చీమల మల్లేష్, మోకాళ్ళ రమేష్, ఊకే రఘు, బుగ్గ వెంకటేశ్వర్లు, యశోద, ఈసం బాలకృష్ణ, ఈసం వినోద్, నిర్మల, రాంబాబు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు