అంబులెన్స్ లోనే ప్రసవం
ఉట్నూర్, నవంబర్ 06 ( విజయక్రాంతి ): గాదిగూడ మండలంలోని దాబా పంచాయతీ(Dhaba Panchayat) పరిధిలోని పూనా గుడా కు చెందిన పేందూరు దేవ్ బాయి(Penduru Dev Bai) (29) మూడవ కాన్పులో పుట్టి నొప్పులతో బాధపడుతుంది. తన భార్య పుట్టినప్పులతో బాధపడుతుందని భర్త రాము 108 అంబులెన్స్(Ambulance) కు ఫోన్ ద్వారా సమాచారం అందించారు. 108 అంబులెన్స్ ఈఎంటి రుక్మిణి, పైలట్ నాందేవ్ లు పునాగూడ కు వెళ్లి పురిటి నొప్పులతో బాధపడుతున్న దేవ్ బాయ్ ని గాది కూడా మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి(Primary Health Center) తీసుకు వస్తుండగా మార్గమధ్యంలోనే ప్రసవమై పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది. తల్లి బిడ్డ క్షేమంగా ఉన్నారని, వారికి వైద్యం కొరకు ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు.