వైభవంగా పోచమ్మ తల్లి విగ్రహ ప్రాణప్రతిష్ఠ

30-10-2026 | 06:02pm

గుమ్మడిదల: గుమ్మడిదల మండలం కొత్తపల్లి గ్రామంలో గత మూడు రోజులుగా నిర్వహిస్తున్న శ్రీ పోచమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవాలు భక్తిశ్రద్ధలతో మండల పార్టీ అధ్యక్షులు కొత్తపల్లి ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో కొనసాగుతున్నాయి. శుక్రవారం నాడు వేదమంత్రోచ్ఛారణలు, మంగళవాయిద్యాల నడుమ వేదమూర్తులు పోచమ్మ తల్లి విగ్రహ ప్రాణప్రతిష్ఠ కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు.

కార్యక్రమానికి బిఆర్ఎస్ పార్టీ కోఆర్డినేటర్ వి.ఆదర్శ్ రెడ్డి, రాష్ట్ర నాయకులు చిమ్ముల గోవర్ధన్ రెడ్డి, మాజీ జెడ్పిటిసి కొలన్ బాల్రెడ్డి, మున్సిపల్ చైర్మన్ కుమార్ గౌడ్ హాజరై పోచమ్మ తల్లిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారి ఆశీస్సులు గ్రామ ప్రజలందరిపై ఉండాలని, గ్రామం సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో సర్పంచ్ మంజుల సత్తయ్య, ఉప సర్పంచ్ రామేశ్వరి ఉమారెడ్డి, అనంతారం సర్పంచ్ కొమ్ము శీను, తొంట అంజయ్య, దేవేందర్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, కౌన్సిలర్లు, వార్డు సభ్యులు, ఆలయ కమిటీ సభ్యులు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు