కంపసాటి వీరయ్య పార్థివ దేహానికి నివాళులర్పించిన మాజీ ఎమ్మెల్యే

30-10-2026 | 06:07pm

కూసుమంచి, అక్టోబర్ 30(విజయక్రాంతి): మండలంలోని రాజుపేట బజార్ గ్రామానికి చెందిన కంపసాటి వీరయ్య  మరణించిన విషయం తెలుసుకున్న సత్తుపల్లి మాజీ ఎమ్మెల్యే  సండ్ర వెంకట వీరయ్య(Former Sathupalli MLA Sandra Venkata Veeraiah)  రాజుపేట బజార్ గ్రామానికి చేరుకుని వారి పార్థివ దేహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం వారి కుటుంబ సభ్యులు వెంకన్న, గోవిందు, లింగయ్య, కృష్ణలను పరామర్శించి, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ మనోధైర్యం కల్పించారు.

ఈ కార్యక్రమంలో పెరికసింగారం మాజీ ఎంపీటీసీ మోదుగు వీరభద్రం  కూడా పాల్గొని వీరయ్య పార్థివ దేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. గ్రామ సర్పంచ్ శిరీష రవి, ఉప సర్పంచ్ సీతారాములు మౌనిక, రాజుపేట సర్పంచ్ బానోత్ మహేష్,  శ్రీనివాసు సారెడ్డి వెంకటరెడ్డి, గ్రామ నాయకులు కూడ పాల్గొని కంపసటి వీరయ్య  మృతదేహానికి నివాళులర్పించారు.

మరిన్ని వార్తలు