ఢిల్లీకి కాంగ్రెస్ నాయకులు
30-10-2026 | 06:03pm
మంచిర్యాల టౌన్, (విజయక్రాంతి): ఏఐసీసీ, పీసీసీ పిలుపు మేరకు ఢిల్లీకి మంచిర్యాల కాంగ్రెస్ నాయకులు(Mancherial Congress leaders) శుక్ర వారం బయలుదేరి వెళ్లారు. కేంద్ర ప్రభుత్వ వ్యతిరేక విధానాలకు నిరసనగా ఢిల్లీలోని రాంలీల మైదానంలో నవంబర్ 1న జరగబోయే భారీ బహిరంగ సభకు మంచిర్యాల శాసన సభ్యులు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు, మంచిర్యాల జిల్లా మాజీ డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ ఆధ్వర్యంలో ఛలో డిల్లీ కార్యక్రమానికి మంచిర్యాల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు బయలు దేరి వెళ్లారు.