అవినీతి రహిత సేవలను అందించాలి

30-10-2026 | 06:00pm

ఏసిబి డిఎస్పి వై రమేష్ 

భద్రాద్రి కొత్తగూడెం అక్టోబర్ 30 (విజయక్రాంతి): ప్రభుత్వ కార్యాలయాల్లో(Government offices) అవినీతి రహిత పారదర్శక పాలన ప్రజలకు అందించాలని ఎసిబి డిఎస్పి వై రమేష్(ACB DSP Y. Ramesh) కోరారు. శుక్రవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యాలయంలో విజిలెన్స్ అవగాహన కార్యక్రమంలో భాగంగా అవినీతి నిరోధక కార్యక్రమాలు చేశారు.

ఈ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ అక్టోబర్ 26 నుంచి నవంబర్ 1వ తేదీ వరకు అభివృద్ధి కోసం సత్యనిష్ట కార్యక్రమాన్ని చేపట్టామన్నారు. అవినీతి నిర్మూలన, నిజాయితీ, పారదర్శకత, జవాబుదారీతనం, నైతిక విలువలపై ఉద్యోగస్తులకు అవగాహన కల్పించారు. ప్రభుత్వ ఉద్యోగి ఎవరైనా లంచం కోసం డిమాండ్ చేస్తే భయాందోళన చెందకుండా ఏసీబీకి ఫిర్యాదు చేయాలన్నారు.

ఫిర్యాదులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అవినీతి రహిత సమాజ నిర్మాణం కోసం ఉద్యోగస్తులు ప్రజలు సమిష్టిగా కృషి చేయాలని కోరారు.

ఫిర్యాదు చేయాల్సిన నెంబర్లు 

టోల్ ఫ్రీ 1064, ఏసీబీ ఖమ్మం రేంజ్ డీఎస్పీ 9154388981

ఏసీబీ ప్రధాన కార్యాలయం 9154388989 కు ఫిర్యాదు చేయాలన్నారు.

ఈ కార్యక్రమంలో జిల్లా వైద్యశాఖ, విద్యాశాఖ అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు