ఇందిరమ్మ మైనారిటీ మహిళా యోజన పథకం

30-10-2026 | 06:10pm

జగిత్యాల, అక్టోబర్ 30 ( విజయ క్రాంతి): జగిత్యాల ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో(Jagtial MLA Camp Office) జగిత్యాల రూరల్ మండలం పొలాస, నర్సింగ పూర్ గ్రామాలకు చెందిన ముస్లిం మైనారిటీ మహిళలకు ఇందిరమ్మ మైనారిటీ మహిళా యోజన పథకం 2025–26 కార్యక్రమంలో భాగంగా స్వయం ఉపాధి కల్పన నిమిత్తం మంజూరైన చెక్కులను జగిత్యాల శాసనసభ్యులు డా. సంజయ్ కుమార్ అందజేశారు.

ఈ సందర్భంగా పొలాసకు చెందిన యండి సైమా సమీర్, రహీమ బేగం ఖాజా మొహినోద్దీన్, నర్సింగపూర్ గ్రామానికి చెందిన అఫ్రీనా బేగం యం డి భాషూ లకు ఒక్కొక్కరికి రూ.50,000 చొప్పున చెక్కులను ఎమ్మెల్యే అందజేశారు. మైనారిటీ మహిళలు స్వయం ఉపాధి ద్వారా ఆర్థికంగా అభివృద్ధి చెందేలా తెలంగాణ ప్రభుత్వం పలు సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ తెలిపారు.

ప్రభుత్వం(Government) అందిస్తున్న ఆర్థిక సహాయాన్ని సద్వినియోగం చేసుకుని మహిళలు స్వయం ఉపాధి రంగంలో(Women's Self-Employment Sector) రాణించాలని ఆయన ఆకాంక్షించారు. సంపన్న దేశాలలో సైతం ప్రభుత్వం అందరికీ ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వలేదు అని, స్వయం ఉపాధి అవకాశాలు సృష్టించుకోవాలీ అని ప్రభుత్వ సహకారం ఉంటుందని అన్నారు.

ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గాజంగి నందయ్య, ఎంపీడీవో రమాదేవి, సర్పంచ్ మీల్కూరి శంకర్, మాజీ జెడ్పీటీసీ పెండెం రాములు, నాయకులు శ్రీరాం భిక్షపతి, జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు ముఖీద్ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు