ఆదివాసీలకు గుస్సాడీ పెద్ద పండుగ. పెళ్లి సంబంధాలకు వేదిక

06-11-2026 | 06:49pm

బోథ్. నవంబర్ 6 (విజయక్రాంతి): ఆదివాసీలకు గుస్సాడీ పండుగ(Gussadi Festival) ఎంతో పెద్దదని పండుగ ఖర్చుతో కూడుకున్నది అయినా ఆచారాల ప్రకారం ఆదివాసి గూడేల ప్రజలు జరుపుకోవడం జరుగుతుందని పిప్పల్ దరి గ్రామ పటేల్ లక్ష్మణ్ పేర్కొన్నారు. శుక్రవారం మండలంలోని ఉప్పల్దరి గ్రామంలో అందూర్ గ్రామానికి చెందిన ఆదివాసీలు ఆతిథ్యం పొందారు. గుస్సాడీలు సాయంత్రం వరకు నృత్యాలు చేసి ఆలరించారు. ఈ సందర్భంగా గ్రామస్తులంతా ఒకచోట చేరి నృత్యాలను తిలకించారు...

పెళ్లి చూపులకు వేదిక..

ఆదివాసి యువకులు గుస్సాడీల సందర్భంగా పెళ్లి చూపులకు వేదికగా మారింది అన్నారు. గుస్సాడీ దేశాలు వేసిన యువకులు వారితో వచ్చిన వారు సైతం పెళ్ళికాని యువతులను గమనించి పెళ్లి చూపులకు వేదికగా మార్చుకుంటారన్నారు. వారు మెచ్చిన అమ్మాయిల కుటుంబాల గురించి తెలుసుకొని కుటుంబ పెద్దలకు చెప్పి పెళ్లి సంబంధాలు కుదురుచుకుంటారన్నారు.

తరతరాలుగా ఆచారం...

గుస్సాడి పండుగ వేడుకలు తరతరాలుగా కొనసాగుతుందని దేశంలో ఉన్న ఆదివాసీలంతా గ్రామాలలో గుస్సాడీ వేడుకలను జరుపుకుంటారన్నారు. విద్యార్థులు రైతులు తమ గ్రామంలోనే ఉండి గుస్సాడీ నృత్యాలను తిలకిస్తారు. ఇది ఏమైనా ఆచార వ్యవహారాలకు తోడుగా బంధుత్వానికి మారుపేరుగా పెళ్లి సంబంధాలకు వేదికగా ఈ పండుగ జరుగుతుంది.

మరిన్ని వార్తలు