కామ్రేడ్ గుండా మల్లేష్ పోరాటాలు స్పూర్తి దాయకం

13-10-2026 | 02:44pm

సీపీఐ జిల్లా కార్యదర్శి ప్రభాకర్ రెడ్డి

ఆదిలాబాద్,(విజయక్రాంతి): సీపీఐ పార్టీ(CPI Party) సీనియర్ నాయకులు, మాజీ ఎమ్మెల్యే స్వర్గీయ కామ్రేడ్ గుండా మల్లేష్(Former MLA Gunda Mallesh) పేదల కోసం చేసిన పోరాటాలు ఎందరికో స్పూర్తి దాయకం అని సీపీఐ జిల్లా కార్యదర్శి ముడుపు ప్రభాకర్ రెడ్డి అన్నారు. మంగళవారం సీపీఐ జిల్లా కార్యాలయంలో కామ్రేడ్ గుండా మల్లేష్ 6వ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. 

అనంతరం ముడుపు ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ.. ఎక్కడ అన్యాయం జరిగే అక్కడ ప్రజల పక్షాన పోరాడేవారన్నారు.  గుండా మల్లేష్ పేరు ప్రజల్లో గుండెల్లో ఎప్పుడు నిలిచిపోతుందన్నారు. ముఖ్యంగా పేదల సమస్యల పరిష్కారంలో గుండా మల్లేష్ కీలకపాత్ర పోషించారని గుర్తు చేశారు. నాలుగు సార్లు బెల్లంపల్లి శాసనసభ్యులుగా గెలిచి, ప్రజలకు అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసి చిరస్థాయిగా ప్రజల గుండెల్లో నిలిచారన్నారు. బికేఎంయు జిల్లా అధ్యక్షులు అద్దంకి రమేష్, ఎఐటియుసి రాష్ట్ర నాయకులు కుంటాల రాములు, సీపీఐ సీనియర్ నాయకులు షేక్ పాషా తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు