చెల్లని రూపాయిని జిల్లా ప్రజలపై రుద్దే ప్రయత్నం

26-10-2026 | 11:22pm

బోథ్ అక్టోబర్ 26 (విజయక్రాంతి): కాంగ్రెస్ పార్టీ ఎన్నో అవకాశాలు కల్పించిన వాటిని సద్వినియోగం చేసుకోలేని వ్యక్తి ఎన్ ఎస్ యుఐ రాష్ట్ర మాజీ అధ్యక్షులు భార్గవ్ దేశ్పాండే(Bhargav Deshpande) చెల్లని రూపాయి అని ఆయన మాట్లాడే మాటలు బి ఆర్ ఎస్ నాయకులు రాసి ఇచ్చిన స్క్రిప్ట్ మాత్రమేనని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి పసులచ్చంటి పేర్కొన్నారు. ఆదిలాబాద్ జిల్లాలో అవకాశవాద రాజకీయాలకు తావు లేదనే విషయాన్ని విమర్శలు చేసిన ఆ పార్టీ నాయకులకు అర్థం అయి ఉంటుందన్నారు.

వ్యక్తిగత అవసరాల కోసం పార్టీ మార్చిన వారికి ప్రజలు గుర్తింపు ఇవ్వరనేది పార్టీ మార్చిన నాయకులు గుర్తుంచుకోవాలన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభివృద్ధి సంక్షేమం పైన దృష్టి సారించాలని ఆయన హయాంలో రానున్న ఎన్నికల్లో ఎమ్మెల్యే స్థానాలతో పాటు స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయ దుందుభి మోగిస్తారు అన్నారు. కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ బొడ్డు గంగారెడ్డి కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు మెరుగు భోజన్న, కుచలాపూర్ మాజీ సర్పంచ్ మైలి నారాయణ, ఉపసర్పంచ్ల పోరం జిల్లా అధ్యక్షులు సుద్దల అరుణ్ రెడ్డి, బోత్ మండల ప్రధాన కార్యదర్శి చౌహన్ దేవిదాస్, నాయకులు అనిల్ కుమార్, మడవి జలపతి, లక్ష్మారెడ్డి తదితరులు ఉన్నారు.

మరిన్ని వార్తలు