జ్యోతిష్యంలో డాక్టరేట్ సాధించిన ఆర్.సి.పురం వాసి

26-10-2026 | 11:33pm

రామచంద్రపురం అక్టోబర్ 26: భారతి నగర్ డివిజన్ పరిధిలోని బిడియల్ కాలనీలో నివాసముంటున్న శ్రీమతి సుజాత సుబ్రహ్మణ్యం వడ్లమాని(Sujatha Vadlamani) కొద్ది రోజుల క్రితం జ్యోతిష్య శాస్తంలో డాక్టరేట్ పట్టాను అందుకున్నారు. పుదుచ్చేరిలోని కంబన్ కలై అరంగం ఆడిటోరియంలో శనివారం జరిగిన అవార్డు ప్రధానోత్స కార్యక్రమంలో పలువురు ప్రముఖుల చేతుల మీదుగా గౌరవ డాక్టరేట్ ను అందుకున్నారు.

ఎంబీఏ (హెచ్ ఆర్), ఎంఏ సైకాలజీ, ఎంఏ సంస్కృతం, ఎంఏ జ్యోతిష్య శాస్త్రంలో డిగ్రీలు పొందిన డా. సుజాత పంతకాని గత పదేళ్లుగా ఆధ్యాత్మిక సేవలో కొనసాగుతున్నారు. ఆధ్యాత్మిక కుటుంబం నుండి వచ్చిన ఆమె సమాజ సేవ చేయాలనే తపనతో రాజస్థాన్, కర్ణాటక, ఉమ్మడి తెలుగు రాష్ట్రాలతో సహా పలు రాష్ట్రాల్లో సామాజిక, ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలు నిర్వహించారు. జ్యోతిష్య రత్న అవార్డు గ్రహీత అయిన డా. సుజాత ప్రశ్న తంత్రం, శకున శాస్త్రం, న్యూమరాలజీ వంటి జ్యోతిష్య శాస్త్రంలోని ప్రత్యేక విభాగాలలో నైపుణ్యం సాధించి, గత దశాబ్ద కాలంగా ఎంతో మందికి పరిష్కార మార్గాలు చూపుతున్నారు.

దీంతో పాటు సికింద్రాబాద్ లోని కిమ్స్ హాస్పిటల్ ఆధ్వర్యంలో డిమెన్షియా రోగులు, వారి సంరక్షకుల కోసం నిర్వహించిన పరిశోధన కార్యక్రమంలో కూడా ఆమె విరివిగా పాల్గొంటూ సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా డా. సుజాత పంటకాని మాట్లాడుతూ ఈ ప్రతిష్టాత్మక అవార్డు నా సేవా కార్యక్రమాలకు మరింత ప్రోత్సాహాన్నిచ్చిందన్నారు. భవిష్యత్తులో సమాజం పట్ల మరింత బాధ్యతతో ముందుకు సాగేందుకు స్ఫూర్తినిచ్చిందని, సమాజ శ్రేయస్సు కోసం నా వంతు కృషి నిరంతరం కొనసాగుతుందన్నారు.

ఈ కార్యక్రమానికి యునైటెడ్ అమెరికన్ యూనివర్సిటీ డైరెక్టర్ & ట్రస్టీ జస్టిస్ డా. టి. వెంకటేష్ అధ్యక్షత వహించగా, తమిళనాడు ప్రభుత్వ మాజీ ప్రిన్సిపల్ సెక్రటరీ పి.ఆర్. సంపత్, అంతర్జాతీయ న్యాయ నిపుణులు డా. పర్మీందర్ సింగ్, యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ పి. అమృతవల్లి, జాతీయ మానవ హక్కుల కమిషనర్ డా. టి. సుషుమ్నా రావు, మద్రాస్ హైకోర్టు గౌరవ మధ్యవర్తి డా. ఎస్. సిద్ధార్థ్ తదితర ప్రముఖులు హాజరయ్యారు. అనంతరం  డాక్టరేట్ అందుకున్న డా. సుజాతకు కుటుంబ సభ్యులు, మిత్రులు, శ్రేయోభిలాషులు, విద్యార్థులు, వివిధ రంగాల ప్రముఖులు అభినందనలు తెలిపారు. ‎

మరిన్ని వార్తలు