అదుపు తప్పి ఆటో బోల్తా
ఇద్దరి పరిస్థితి విషమం
ప్రయాణిస్తున్న, ఐదుగురికి తీవ్ర గాయాలు
ఎల్లారెడ్డి అక్టోబర్ 26 (విజయక్రాంతి): అదుపుతప్పి ఆటో గుంతలోకి దూసుకుపోవడం అమాంతంగా పడిపోవడంతో ఆటోలో ప్రయాణిస్తున్న ప్రయాణికులకు తీవ్ర గాయాలైనట్లు స్థానికులు తెలిపారు. స్థానికులు ఆ గ్రామ ప్రజలు తెలిపిన వివరాల ప్రకారం ఎల్లారెడ్డి(Yellareddy) మండలంలోని తిమ్మాపూర్ గ్రామపంచాయతీ పరిధి సమీపంలో తిమ్మాపూర్ నుండి ఎల్లారెడ్డి వైపు వస్తున్న ఆటో అదుపుతప్పి రోడ్డు పక్కనే ఉన్న గుంతలోకి దూసుకెల్లడంతో ప్రయాణిస్తున్న వారికి తీవ్ర గాయాలయి ఎల్లారెడ్డి ప్రభుత్వాసుపత్రికి తరలించినట్లు ఆ గ్రామస్తులు పేర్కొన్నారు. తీవ్రంగా గాయాల పాలైన వారిని ప్రభుత్వ ఆసుపత్రి ఎల్లారెడ్డికి తరలించినట్లు తెలిపారు.
ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు రవీంద్ర మోహన్ తెలిపిన వివరాల ప్రకారం తిమ్మాపూర్ పరిసర ప్రాంతంలో జరిగిన ఆటో ప్రమాదంలో ప్రయాణించిన డ్రైవర్ తో మొత్తం ఏడుగురు ప్రయాణించారని అందులో ప్రమాదంలో ఇద్దరికీ తీవ్ర గాయాలు కావడంతో పరిస్థితి విషమంగా ఉండడంతో జిల్లా ఆసుపత్రి కామారెడ్డికి తరలించినట్లు మిగతా ఐదుగురికి ఎల్లారెడ్డి ప్రభుత్వాసుపత్రిలో వైద్యం అందిస్తున్నట్లు వైద్యులు రవీంద్ర మోహన్ తెలిపారు.