పొచ్చెరచింతగూడ గ్రామాల పార్టీ నూతన అధ్యక్షుల నియామకం
06-11-2026 | 07:30pm
బోథ్. నవంబర్ 6 (విజయక్రాంతి): మండలంలోని పోచింతగూడ కాంగ్రెస్ పార్టీ(Congress Party) గ్రామ నూతన అధ్యక్షుడు నియామకం చేపట్టినట్టు మండల కాంగ్రెస్ పార్టీ కన్వీనర్ మెరుగు భోజన్న పేర్కొన్నారు. పార్టీని గ్రామస్థాయిలో బలోపేతం చేసేందుకు గ్రామ కమిటీల నియామకం జరుగుతుందన్నారు. పొచ్చెర గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా ఆలపాటి శ్రీకాంత్ రెడ్డి, చింతగూడ అధ్యక్షునిగా గోడం రమేష్ లను నియమించామన్నారు. నూతనంగా నియమించబడ్డ గ్రామ కమిటీ అధ్యక్షులు పార్టీ బలోపేతానికి కృషి చేయాలని కోరారు.