ఫోక్సో చట్టంపై విద్యార్థినులకు అవగాహన ఉండాలి
బోథ్ అక్టోబర్ 26 (విజయక్రాంతి): ఫోక్సో చట్టం(POCSO Act)పైన విద్యార్థినులకు అవగాహన కలిగి ఉండాలని అయితేనే లైంగిక వేధింపులకు గురికాకుండా ఉంటారని బోత్ మున్షిప్ మెజిస్ట్రేట్ కుంభ సందీప్ పేర్కొన్నారు. సోమవారం మండల కేంద్రంలోని బాలికల ఆశ్రమం పాఠశాలలో ఫోక్సో చట్టం పైన విద్యార్థులకు అవగాహన కలిగించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాలికలపై లైంగిక వేధింపులు గుడ్ టచ్ బ్యాడ్ టచ్ అంశాల విషయంలో వివరించారు బాలికల రక్షణ చట్టం ప్రాముఖ్యత మంచి స్పర్శ చెడు స్పర్శ మధ్య తేడాల గురించి వివరించడం జరిగింది. పిల్లలు తమపై జరిగే అనుచిత ప్రవర్తనను గుర్తించి భయపడకుండా నమ్మకమైన పెద్దలకు గాని ఉపాధ్యాయులకు తెలియజేయాలని సూచించారు కార్యక్రమంలో ఏజిపి పంద్రం శంకర్ న్యాయవాది కుమ్మరి విజయకుమార్ ప్రధానోపాధ్యాయులు ఆత్రం శంకర్ మడవి లాలుదేవ్ పరశురాం తదితరులు పాల్గొన్నారు..