ఆదివాసి సంక్షేమ పరిషత్ మండల కమిటీ ఎన్నిక
06-09-2026 | 08:05pm
సోనాల, సెప్టెంబర్6(విజయక్రాంతి): ఆదివాసి సంక్షేమ(Tribal Welfare) పరిషత్ సోనాల మండల(Sonala Mandal) కమిటీని జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. గౌరవ అధ్యక్షులు బండు, ఉపాధ్యక్షులుగా శిడం మహేష్, అధ్యక్షులు జుగునక్ మారుతి, ప్రధాన కార్యదర్శి మెస్రం దత్తు, కార్యదర్శులు మాణిక్యరావు బుర్కే రాం దాస్, సంయుక్త కార్యదర్శులు జలపతి, డుక్రే వెంకట్రావు, కోశాధికారి ఆత్రం తులసిరం, సలహాదారులుగా ఆత్రం గంగాధర్., కమిటీ సభ్యులు పురుషోత్తం, తొడసం భీమ్రావు, రాయి సీడం జాకేశ్, లను ఎన్నుకున్నారు.






