02-04-2025
ముంబై, ఏప్రిల్ 1: ట్రంప్ సుంకాల భయంతో స్టాక్ మార్కెట్లు విలవిల్లాడాయి. ఉదయం నుంచి నష్టాల్లోనే కొనసాగిన సూచీలు చివరకు భారీ నష్టాలతో ముగిశాయి. సెన్సెక్స్ 1390 పాయింట్ల మేర కోల్పోగా, నిఫ్టీ 353.65 పాయింట్ల మేర పడిపోయింది. కొత్త ఆర్థిక సంవత్సరం తొలి రోజే మార్కెట్లు ఇంతలా పతనమవడం గమనార్హం. ట్రంప్ సుంకాల భయంతోనే మార్కెట్లు ఇంతలా నష్టపోయినట్టు పలువురు అభిప్రాయపడుతున్నారు.
02-04-2025
న్యూఢిల్లీ, ఏప్రిల్ 1: బంగారం ధర కొత్త రికార్డులకు చేరుకుంది. దేశ రాజధాని ఢిల్లీలో 10 గ్రాముల బంగారం ధర రూ. 94,150కి చేరుకుంది. బంగారంలో అనేక మంది పెట్టుబడులు పెట్టేందుకు మొగ్గు చూపుతుండటంతో పుత్తడి జెట్ స్పీడ్తో దూసుకు పోతున్నట్లు పలువురు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ 2025లో ఇప్పటికే బంగారం 18 శాతం మేర పెరిగింది. ఇక కిలో వెండి ధర రూ. 500 తగ్గి రూ. 102,500కి చేరుకుం ది. బంగారం ధర పెరిగేందుకు ట్రంప్ సుంకాల భయం కూడా ఓ కారణం అని ఎనలిస్టులు చెబుతున్నారు.
30-03-2025
వేసవి వచ్చేసింది.. ఎండలకు కొద్ది సేపటికే గొంతెండి పోతుం టుంది. శరీరం ఎక్కువగా డీహైడ్రేట్ అయి పోతూ ఉం టుంది. ఇలాంటి సమయం లో శీతల పానీయాలు శరీరానికి చాలా హాయినిస్తా యి. ఇలాంటి సమయంలో రోడ్డు పక్కన దొరికే పానీయాలు తాగడం ఆరోగ్యానికి మంచి ది కాదు. మన ఇంట్లో తయా రు చేసుకుంటే చాలా మంచి ది. మనం ఇంట్లో సింపుల్గా తయారు చేసుకునే వండర్ డ్రింక్.. నిమ్మ జ్యూ స్. ఒక గ్లాస్ నిమ్మ జ్యూస్ తీసుకుంటే శరీరానికి 76 కిలో కేలరీల శక్తి లభిస్తుంది.
30-03-2025
రోజు బాదం తినడం వల్ల అనేక లాభాలు పొందొ చ్చు. శారీరకంగా, మానసికంగా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను అందించడంలో బాదం పప్పులు ఏమాత్రం తగ్గవు. అందుకే ఈ మధ్య చాలా మంది తమ డైలీ రోటీన్లో వీటిని భాగం చేసుకుంటున్నారు. బాదంపప్పుల్లో న్యూట్రియంట్లు అధికంగా ఉండి మెదడు పనితీరును మెరుగుపరుస్తుంది. న్యూరోడీజనరేటివ్ జబ్బులైన అల్జీమర్స్ లాంటివి రాకుండా కాపాడుతుంది.
30-03-2025
అతి అనేది అన్ని విధాలా అనర్థమే. తిండి, నిద్ర దైనందిన జీవితంలో ఏది ఎక్కువైనా కష్టమే. కొందరు నిద్ర పోవడానికి తిప్పలు పడితే.. మరికొందరు చిటికెలో నిద్ర పోతారు. వారికి పరుపులు, ప్రదేశంతో పని ఉండదు. వదిలేస్తే రోజంతా అయినా పడుకునే ఉంటారు. నిద్ర మనసుకే కాకుండా శరీరానికి కూడా బూస్టర్లా పని చేస్తుంది. రోజుకు ఎనిమిది గంటల నిద్ర చాలా ఆరోగ్యకరం. కనీసం 7 గంటలైనా మంచిగా నిద్రపోవాలి. అలాగని అతి నిద్ర బూస్టర్ కాదు.. అనారోగ్యానికి కారణమవుతుంది. దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ చాలానే ఉన్నాయి. అతి నిద్ర అంటే రోజుకు 9 గంటల కంటే ఎక్కువ నిద్ర పోయే వారు ఎక్కువగా డిప్రెషన్కు గురవుతారట. ఎక్కువ సేపు నిద్ర పోవడం వలన మెదడు పని తీరు దెబ్బ తింటుందని నిపుణులు చెబుతున్నారు.
23-03-2025
మనం ఫిట్గా ఉండటానికి, రోజంతా ఉత్సాహంగా పనులు చేసుకోవడానికి శరీరానికి తగిన వ్యాయామం తప్పనిసరి. రోజుకు అరగంట చొప్పున.. వారానికి కనీసం ఐదు రోజుల పాటు వ్యాయామం చేయాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరిస్తుంది. వారానికి కనీసం 150 నిమిషాలైనా వ్యాయామం చేయడం ఆరోగ్యానికి మంచిది. ముఖ్యంగా 60 ఏళ్లుపైబడిన వృద్ధులు రోజుకు అరగంట పాటు వాకింగ్ చేయడం వల్ల గుండెజబ్బుల ముప్పు 40 శాతం, పక్షవాతం ముప్పు 50 శాతం వరకు తగ్గుతున్నట్టు యూనివర్సిటీ ఆఫ్ మసాచుసెట్స్ అధ్యయనంలో తేలింది.