పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో రాజ్యాధికార పార్టీదే గెలుపు
రెడ్లు,కాపుల కాలం చెల్లింది
బీసీలదే రాజ్యాధికారం
యాదగిరిగుట్ట కార్నర్ మీటింగ్లో తీన్మార్ మల్లన్న
యాదగిరిగుట్ట , నవంబర్ 9 (విజయక్రాంతి): పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో(Graduate MLC Election) రాజ్యాధికార పార్టీదే(Rajyadhikara Party) గెలుపని కాంగ్రెస్ పార్టీకి(Congress Party) డిపాజిట్ కూడా రాదని తీర్మాన్ మల్లన్న అన్నారు. టీఆర్పీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న(Teenmar Mallanna) చేపట్టిన బీసీ రాజ్యాధికార యాత్ర 47వ రోజు యాదాద్రి జిల్లా(Yadadri District) యాదగిరిగుట్టకు చేరుకున్నది. యాదగిరిగుట్టలో నిర్వ హించిన కార్నర్ మీటింగ్ లో మల్లన్న ప్రసం గించారు. కామారెడ్డి డిక్లరేషన్లో రాహుల్ గాంధీ ఆరు నెలల్లో కులగలను చేస్తానని బీసీలకు రిజర్వేషన్లు కల్పిస్తానని హామీ ఇచ్చారని, తూతూ మంత్రంగా కులగనన చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలను వంచన చేసిందని అన్నారు.
రెడ్లు, రావుల పరిపాలనలో తీవ్రంగా నష్టపోయిన బీసీలు ఇప్పుడు ఆలోచనలో పడ్డారని, బీసీలకు రాజ్యాధికారం వస్తేనే తమ బతుకులు మారుతాయని ఆలోచిస్తున్నారని అన్నారు. రాష్ట్రంలోని ఏ ఒక్క బిసి ఎమ్మెల్యేకు తాను వ్యతిరేకం కాదని, బిసి ఎమ్మెల్యేలు ఎదగాలని కోరుకుంటున్నాను అని అన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలో ఉన్న బీసీ ఎమ్మెల్యేలు తమతో టచ్లో ఉన్నారని అన్నారు. జూన్ 2 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని, 16 వేల కోట్ల మిగులు బడ్జెట్తో రాష్ట్రాన్ని కెసిఆర్ చేతుల్లో పెడితే 10 సంవత్సరాలలో 8.5 లక్షల కోట్ల అప్పులు చేశారని అన్నారు.
కెసిఆర్ పైన ఆయన చేస్తున్న పాలనపైన యుద్ధమే చేశానని ఎన్నో కేసులు పెట్టి జైల్లో వేసిన భయపడలేదని అన్నారు. ఖమ్మం- వరంగల్ -నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో రాజ్యాధికార పార్టీ అభ్యర్థి అయిన అశోకు గెలుపు ఖాయం అని అన్నారు. ఎంతోమందికి విద్యను అభ్యసించి ఎంతోమందిని తీర్చిదిద్దిన ఘనత అశోక్ దని అన్నారు.
కాంగ్రెస్, బిఆర్ఎస్ పార్టీలు రెడ్ల కి ఎమ్మెల్సీ సీటును ఇస్తున్నమని ప్రకటించాయని,రాజ్యాధికార పార్టీ ఎమ్మెల్సీ సీటును బీసీ కు ఇచ్చి గెలిపిస్తుందని అన్నారు. 2028 సార్వత్రిక ఎన్నికల్లో తెలంగాణ రాజ్యాధికార పార్టీ (కత్తెర గుర్తు) పోటీ చేస్తుందని, ఒక్క రెడ్డి కూడా అసెంబ్లీ గేటు తొక్కకుండా బీసీ బిడ్డేలే ఎమ్మెల్యేలుగా గెలిచి అసెంబ్లీకి పోతారని స్పష్టం చేశారు. కార్యక్రమంలో తెలంగాణ రాజ్యాధి కార పార్టీ రాష్ట్ర కార్యదర్శి పిట్టల శంకర్,
రాష్ట్ర కార్యదర్శులు ప్రసన్న, బీకు నాయక్, జాతీయ వ్యవహారాల ఇంచార్జి పూజిత, ఎమ్మెల్సీ అభ్యర్థి అశోక్, జిల్లా నాయకులు కొమ్మిడి శెట్టి నరసింహ, జిల్లా మహిళా అధ్యక్షురాలు సునీత, యాదగిరిగుట్ట అధ్య క్షుడు రమేష్,యాదగిరి గుట్ట మహిళా అధ్యక్షురాలు పుష్ప, ఎస్సీ సెల్ అధ్యక్షులు రఘు, తదితరులు పాల్గొన్నారు.