ఎన్ఎస్యుఐ నేతృత్వంలో ఎమ్మెల్యే గండ్ర జన్మదిన వేడుకలు
భూపాలపల్లి, నవంబర్ 09 (విజయక్రాంతి): భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు(Bhupalpally MLA Gandra Satyanarayana Rao) జన్మదిన వేడుకలను ఎన్ఎస్యూఐ(NSUI) ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలో సోమవారం ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావుతో పాటు కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు బట్టు కరుణాకర్(Congress Party District President Battu Karunakar) ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా కేక్ కట్ చేసి జన్మదిన వేడుకలు(Birthday celebrations) నిర్వహించడంతో పాటు వృద్ధులకు పండ్లు, బెడ్షీట్లు పంపిణీ చేశారు. అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. సేవా కార్యక్రమాల ద్వారా ఎమ్మెల్యే జన్మదిన వేడుకలను ఆనందోత్సాహాల మధ్య నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో మట్టెవాడ సురేష్, ఆలోత్ కిషోర్, అజ్మీరా వినోద్, ప్రవీణ్ బాబు, రాజు, మహేందర్, వికాస్, విజయభాస్కర్, హరీష్ తదితరులు పాల్గొన్నారు.