రాష్ట్ర మీడియా ప్యానలిస్ట్‌గా ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్

09-11-2026 | 09:53pm

టీపీసీసీ ఉత్తర్వులు జారీ

కాంగ్రెస్ శ్రేణుల్లో హర్షాతిరేకాలు

రామగుండం, నవంబర్ 09 (విజయక్రాంతి): రామగుండం ఎమ్మెల్యే మక్కాన్‌సింగ్ రాజ్ ఠాకూర్‌కు(Ramagundam MLA Makkan Singh Raj Thakur) రాష్ట్ర స్థాయి మీడియా ప్యానలిస్ట్‌గా(State-level media panelist) అవకాశం లభించింది. ఈ మేరకు తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ(Telangana Pradesh Congress Committee) (టీపీసీసీ) ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నియామకంతో ఇకపై కాంగ్రెస్ పార్టీ(Congress Party) తరఫున నిర్వహించే పత్రికా సమావేశాలు, టెలివిజన్ చర్చల్లో రాజ్ ఠాకూర్ పాల్గొని పార్టీ విధానాలు, ప్రభుత్వ కార్యక్రమాలు, ప్రజా సమస్యలపై తన అభిప్రాయాలను వెల్లడించనున్నారు.

రామగుండం ఎమ్మెల్యేకు రాష్ట్ర స్థాయిలో కీలక బాధ్యత లభించడంపై నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. రాజ్ ఠాకూర్‌కు పలువురు నాయకులు, పార్టీ శ్రేణులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

మరిన్ని వార్తలు