పీసీసీ అధికార ప్రతినిధిగా సిరాజ్ హుస్సేన్
నియామక ఉత్తర్వులు జారీ..
20 ఏళ్ల పార్టీ సేవలకు గుర్తింపు..
కరీంనగర్ సిటీ, నవంబర్09 (విజయక్రాంతి): కాంగ్రెస్ పార్టీ(Congress Party) కోసం రెండు దశాబ్దాలుగా అంకితభావంతో పనిచేస్తున్న కరీంనగర్‌కు చెందిన సీనియర్ నాయకుడు ఎస్కే. సిరాజ్ హుస్సేన్‌కు(Senior leader SK. Siraj Hussain) టీపీసీసీ అధికార ప్రతినిధిగా కీలక బాధ్యతలు అప్పగించారు. పీసీసీ మీడియా అండ్ పబ్లిసిటీ విభాగం(PCC Media and Publicity Department) చైర్మన్, ఎంపీ చామల కిరణ్‌కుమార్ రెడ్డి(MP Chamala Kiran Kumar Reddy) ఈ మేరకు నియామక ఉత్తర్వులు జారీ చేశారు. పార్టీ పట్ల ఆయన చూపిన నిబద్ధత, క్షేత్రస్థాయిలో అందించిన సేవలను గుర్తిస్తూ ఈ అవకాశం కల్పించడం పట్ల కాంగ్రెస్ శ్రేణుల్లో హర్షం వ్యక్తమవుతోంది.
గత 20 ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్న సిరాజ్ హుస్సేన్ విద్యార్థి దశ నుంచే పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ వచ్చారు. కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శిగా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ యువజన కాంగ్రెస్ కమిటీ రాష్ట్ర కార్యదర్శిగా, జిల్లా వక్ఫ్ బోర్డు సభ్యుడిగా, మహదేవ్పూర్ మండల మైనారిటీ సెల్ అధ్యక్షుడిగా వివిధ బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం భూపాలపల్లి నియోజకవర్గ టీపీసీసీ కోఆర్డినేటర్‌గా కొనసాగుతున్నారు.
కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన అనేక ధర్నాలు, రాస్తారోకోలు, ర్యాలీలు, ప్రజా ఉద్యమాల్లో ప్రత్యక్షంగా పాల్గొన్నారు. రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రలో ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, మంత్రి పొన్నం ప్రభాకర్ తదితర నాయకులతో కలిసి తెలంగాణ వ్యాప్తంగా పాల్గొన్నారు.