సరూర్‌నగర్ చెరువు తీరాన

09-11-2026 | 09:38pm

స్వయంభూ శ్రీ అభయ ఆంజనేయ స్వామి

ప్రత్యేక పూజలు నిర్వహించిన స్థానికులు 

ఎల్బీనగర్: సరూర్‌నగర్ చెరువు(Saroornagar lake) సమీపంలో శ్రీ అభయ ఆంజనేయ స్వామివారి విగ్రహం(Sri Abhaya Anjaneya Swamy Idol) స్వయంభువుగా వెలిసిందన్న విషయం స్థానికంగా భక్తుల్లో ఆధ్యాత్మిక ఆనందాన్ని నింపింది. ఈ విషయం తెలుసుకున్న బీజేపీ నాయకులు అక్కడికి చేరుకుని స్వామివారిని దర్శించుకున్నారు. పూలమాలలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తుల విశ్వాసాలకు అనుగుణంగా సరూర్ నగర్ చెరువు సమీపంలో ఆలయ నిర్మాణం చేపట్టాలని బీజేపీ నాయకులు సూచించారు. 

బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జంగం మధుకర్ రెడ్డి, ఐఎస్ సదన్ మాజీ కార్పొరేటర్ శ్వేతా మధుకర్ రెడ్డి, రంగారెడ్డి జిల్లా మాజీ అధ్యక్షుడు నర్సింహరెడ్డి, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు అమర్నాథ్ రెడ్డి, భాగ్యనగర్ జిల్లా కార్యదర్శి శ్రీకాంత్ రెడ్డి, నాయకులు అరవింద్, విశ్వహిందూ పరిషత్ నాయకులు, స్థానికులు ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు మాట్లాడుతూ... శ్రీ అభయ ఆంజనేయ స్వామివారి విగ్రహం వెలిసిన ప్రాంతంలోనే భక్తుల మనోభావాలను గౌరవిస్తూ శాశ్వతంగా హనుమాన్ దేవాలయాన్ని నిర్మించాలని కోరారు. ఈ ప్రాంతం ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు అందరూ సహకరించాలని పిలుపునిచ్చారు.

మరిన్ని వార్తలు