నేరాల నియంత్రణలో ప్రజల భాగస్వామ్యం కీలకం

09-11-2026 | 09:42pm

వెంకటాపూర్, నవంబర్ 09 (విజయక్రాంతి): మండలంలోని పాలంపేట గ్రామంలో(Palampet Village) ఎస్సై చల్లా రాజు ఆధ్వర్యంలో ప్రజల భద్రత, నేరాల నియంత్రణ(Security and Crime Control) లక్ష్యంగా సీసీ కెమెరాల(CCTV cameras) వినియోగం, మాదకద్రవ్యాల నివారణ(Drug Prevention), సైబర్ నేరాల(Cybercrimes)పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్సై చల్లా రాజు.. మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ తమ ఇళ్ల వద్ద, వ్యాపార సంస్థల వద్ద సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. దొంగతనాలు, అసాంఘిక కార్యకలాపాల నియంత్రణకు సీసీ కెమెరాలు ఎంతగానో ఉపయోగపడతాయని తెలిపారు.

యువత మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని, చెడు వ్యసనాలకు బానిస కాకుండా విద్య, క్రీడలు, మంచి నడవడికపై దృష్టి సారించాలని సూచించారు. అలాగే సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, గుర్తుతెలియని వ్యక్తుల ఫోన్ కాల్స్, అనుమానాస్పద లింకులు, నకిలీ మెసేజ్‌లను నమ్మవద్దని తెలిపారు. ఓటీపీ, బ్యాంకు ఖాతా వివరాలను ఎవరికీ వెల్లడించవద్దని సూచించారు.

సైబర్ మోసానికి గురైతే వెంటనే 1930 హెల్ప్‌లైన్‌కు ఫిర్యాదు చేయాలని వివరించారు. సమాజంలో నేరాల నివారణకు ప్రజలు పోలీసులకు సహకరించాలని, అనుమానాస్పద కార్యకలాపాలు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది, గ్రామస్థులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు