ప్రేయసీ ఇంట్లో ప్రియుడు ఆత్మహత్య
- వెళ్లిపో అన్నందుకు ప్రియురాలి ఇంట్లో ప్రియుడు ఆత్మహత్య
- వనస్థలిపురం పోలీస్ స్టేషన్ లో ఘటన
ఎల్బీనగర్: ప్రేయసీ ఇంట్లో(Girlfriend Home) న్యూసెన్స్ చేస్తుండడంతో ఇక్కడి నుంచి వెళ్లిపో అన్నందుకు ప్రియురాలి ఇంట్లో ప్రియుడు ఆత్మహత్య ఘటన వనస్థలిపురం పోలీస్ స్టేషన్(Vanasthalipuram Police Station) పరిధిలో జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. కొత్తపేట డివిజన్ గ్రీన్ హిల్స్ కాలనీ రోడ్డు నంబర్ 4 లో ఉంటున్న కేతాల శివకుమార్ తండ్రి శ్రీనివాస్(25) అనే యువకుడు సోమవారం వనస్థలిపురంలోని శారదానగర్ లో ఉంటున్న ప్రియురాలి ఇంటికి వచ్చాడు.
అక్కడ యువకుడు న్యూసెన్స్ చేస్తుండగా, యువతి ఇక్కడ న్యూసెన్స్ చేయకుండా.. ఇంటికి వెళ్లాలని పలుమార్లు చెప్పినప్పటికీ వినకుండా అక్కడే ఉన్నాడు. దీంతో యువతి అతడిని ఇంటికి పంపించేందుకు ఓలా ఆటో బుక్ చేసి, ఇంటి బయట ఆటో కోసం వేచి చూస్తున్నది. ఇంతలో శివకుమార్ మనస్తాపానికి గురై ప్రియురాలి ఇంటిలోని బెడ్రూమ్లోకి వెళ్లి తలుపు వేసుకుని, ఫ్యాన్‌కు చీరతో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న వనస్థలిపురం పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి, ఆత్మహత్యపై అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.