రైతుల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం
రైతు మేళా ప్రత్యక్ష ప్రసారాన్ని వీక్షించిన కలెక్టర్ హైమావతి
కొండపాక, నవంబర్ 9 (విజయక్రాంతి): రైతుల సంక్షేమం, వ్యవసాయ రంగ(Welfare of farmers and the agricultural sector) అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యమని జిల్లా కలెక్టర్ హైమావతి(District Collector Haimavathi) అన్నారు. సోమవారం కొడంగల్లో(Kodangal) ముఖ్యమంత్రి నిర్వహించిన మెగా రైతు మేళా కార్యక్రమం(Mega Farmers' Fair Event) ప్రత్యక్ష ప్రసారాన్ని కుక్కునూరు పల్లి మండలం మేదినీపూర్ రైతు వేదికలో అధికారులు, రైతులతో కలిసి వీక్షించారు.
ఈ సందర్భంగా రైతుల సంక్షేమం, వ్యవసాయ అభివృద్ధికి ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ సూచించారు. కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి స్వరూపరాణి, మార్కెట్ కమిటీ చైర్మన్, గ్రామ సర్పంచ్ మధుమోహన్, గజ్వేల్ ఏడీఏ బాబు నాయక్, ఏవో గోవిందరాజు, ఏఈవోలు, ఇతర అధికారులు, రైతులు పాల్గొన్నారు.