కరువులోనూ పంటలు పండించాం

09-11-2026 | 07:37pm

హైదరాబాద్: తెలంగాణలో వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేయడంతో పాటు రైతుల ఆదాయాన్ని పెంచడమే ప్రభుత్వ లక్ష్యమని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు(Minister Tummala Nageswara Rao ) తెలిపారు. రైతుల సంక్షేమం(Farmers Welfare) కోసం ఇప్పటివరకు రూ.1.78 లక్షల కోట్లు ఖర్చు చేసినట్లు పేర్కొన్నారు. కొడంగల్(Kodangal) నియోజకవర్గంలోని లగచర్లలో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు.

పాలమూరు ప్రాంతం అభివృద్ధి చెందితే రాష్ట్రం మొత్తం సుభిక్షంగా మారుతుందని మంత్రి అన్నారు. ఎల్‌నినో ప్రభావంతో కరువు పరిస్థితులు నెలకొన్నప్పటికీ వ్యవసాయాన్ని(Agriculture) కొనసాగించేలా చర్యలు తీసుకున్నామని చెప్పారు. సుమారు 1.30 కోట్ల ఎకరాలకు సాగునీరు అందించే దిశగా ప్రభుత్వం కృషి చేసిందని వివరించారు. కష్టకాలంలోనూ పంటలు పండించిన రైతులకు అండగా నిలుస్తున్నామని తెలిపారు.

రైతులు ఆయిల్ పామ్ సాగు(Oil Palm Cultivation) వైపు మొగ్గు చూపాలని తుమ్మల సూచించారు. ఉగాది నాటికి సాగు చేపట్టే రైతులకు ఆదాయ భరోసా కల్పించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని వెల్లడించారు. ఏడు రకాల వరి ధాన్యానికి మద్దతు ధరతో పాటు బోనస్ ప్రయోజనాలు అందుతున్నాయని పేర్కొన్నారు.

కరువు, వరదలు వంటి ప్రకృతి వైపరీత్యాలను తట్టుకునే వ్యవసాయ విధానాలను ప్రోత్సహించడంపై సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) ప్రభుత్వం దృష్టి సారించిందని మంత్రి చెప్పారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ఏడాదిలో 14 పరిశ్రమల నిర్మాణం జరుగుతోందని వెల్లడించారు. రైతుల ఆదాయం పెరగడం, వ్యవసాయ ఆధారిత పరిశ్రమల అభివృద్ధి ప్రభుత్వ ప్రాధాన్యతలని స్పష్టం చేశారు.

ఇదే సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రూ.9,050 కోట్ల విలువైన అభివృద్ధి పనులతో పాటు ఎకో పామాయిల్ ఫ్యాక్టరీకి శంకుస్థాపన చేశారు. రూ.5 వేల కోట్లతో నిర్మించనున్న నాచారం నుంచి కొత్వాల్‌గూడ వరకు రేడియల్ రోడ్-2 పనులకు కూడా శ్రీకారం చుట్టారు.

మరిన్ని వార్తలు